కారు బోల్తాపడి మంటలు…ఐదుగురు సజీవ దహనం

Date:14/09/2019

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలంలోని మామడుగు వద్ద వేగంగా వెళ్ళుతున్న కారు బోల్తా పడటం తో కారులో మంటలు చెలరేగి 5గురు మృతి  చెందారు. తిరుపతి నుంచి బెంగళూరు వైపువెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారులో ఒక్కసారి మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు మంటల్లో కాలి బూడిదయ్యారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ముగ్గరుపెద్దలు, ముగ్గురు పిల్లలు వున్నారు. టిటిడి లో జూనియర్ అస్సిటెంట్  గా పనిచేస్తున్న విష్ణు బతికి ఉన్నారు. కారులో విష్ణుతో పాటూ విష్ణు  భార్య, కూతురు, కొడుకు, చెల్లెలు,చెల్లెలు కూతురుఉన్నారు.

 

 

 

విష్ణు గాయాలతో బయటపడగా, మిగిలిన 5 మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో విష్ణు భార్య జాహ్నవి, కుమారుడు పావన్ రామ్, కుమార్తె సాయి ఆశ్రీత, విష్ణు చెల్లెలు కళ ఆమెకుమారుడు భాను తేజలు మృతిచెందారని పోలీసులు తెలిపారు.  ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్షతగాత్రుడినిచికిత్స నిమిత్తం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

108 పత్తి కొనుగోళ్లు కేంద్రాలు సిద్ధం

Tags: Car burns and burns… five alive

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *