Natyam ad

చెట్టును ఢీకొన్న కారు..ఇద్దరు మృతి

జయశంకర్ భూపాలపల్లి ముచ్చట్లు:

భూపాల‌ప‌ల్లి జిల్లాలో గురువారం అర్ధ‌రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం చోట చేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపు త‌ప్పి రోడ్డుప‌క్కన చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు అక్క‌డికక్కడే దుర్మరణం పాలయ్యారు.మృతి చెందారు. సమాచారం అందుకున్న  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన పూజారి ప‌వ‌న్ (23), సుబ్బ‌క్క‌ప‌ల్లి గ్రామానికి చెందిన చింతల సాయికిర‌ణ్ లు మొగుళ్ల‌ప‌ల్లి మండ‌లంలో జ‌రిగిన ఓ వివాహానికి హాజ‌రై తిరిగి వ‌స్తున్నారు. భూపాల‌ప‌ల్లి జిల్లా రేగొండ శివారుకు దగ్గరకు రాగానే కారు  అదుపు త‌ప్పి చెట్టును ఢీ కొట్టింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

Post Midle

Tags: Car collided with a tree..Two killed

Post Midle