లారీని ఢికొన్న కారు..నలుగురు విద్యార్దులు మృతి

గుంటూరు ముచ్చట్లు:


గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్తిపాడు మండల పరిధిలోని తుమ్మలపాలెం వద్ద ఈ దారుణం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మృతులను కాకినాడకు చెందిన చైతన్య పవన్‌, విజయవాడకు చెందిన గౌతమ్‌ రెడ్డి, విశాఖపట్నంకు చెందిన సౌమ్యికగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరో యువతి మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది.
విజయవాడ నుంచి చిలకలూరిపేట వైపు వెళ్తున్న ఈ కారు.. రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతులు గౌతమ్‌ రెడ్డితో పాటు మిగతా ముగ్గురు ఆర్కిటెక్చర్ విద్యార్థులుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొక వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Tags: Car collided with lorry, four students died

Leave A Reply

Your email address will not be published.