ఘాట్ రోడ్ లో అదుపుతప్పిన కారు
-ఒకరు మృతి ,మరొకరికి తీవ్ర గాయాలు
కార్వేటి నగరం ఘాట్ రోడ్డు లోని డంపింగ్ యార్డ్ సమీపంలో ఘటన
చిత్తూరు ముచ్చట్లు:
తిరుపతి నుండి కార్వేటి నగర్ కు వస్తుండగా కారు అదుపు చేయలేక ఘాట్ రోడ్డులోని కొండ రాళ్లను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్రగాయాలయ్యాయి.
మృతుడు తిరుపతి రూరల్ మండలం, ముత్యాల రెడ్డి పల్లి కి చెందిన మురళి కృష్ణా రెడ్డి కుమారుడు కె.భానుచంద్ (21)గా పోలీసులు గుర్తించారు. వైకుంఠపురం కు చెందిన సురేందర్ రెడ్డి కుమారుడు డి. హర్షకు తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు.

Tags; Car out of control on Ghat Road
