Natyam ad

పుంగనూరులో కర్నాటక మధ్యంతో సహ కారుస్వాధీనం – ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

పుంగనూరు ముచ్చట్లు:

కర్నాటక నుంచి అక్రమంగా కారులో 20 బాక్సుల అక్రమ మధ్యంను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కారును, మధ్యంను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఈబి జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ మధుమోహన్‌రావు తెలిపారు. బుధవారం సాయంత్రం ఎస్‌ఈబి స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మధుమోహన్‌రావు మాట్లాడుతూ గంగవరం మండలం కీలపట్లకు చెందిన కార్తీక్‌, గిరిబాబు కలసి కర్నాటక కారు కెఏ07 ఎ5536 కారు , ఎన్‌ఫీల్డ్ బూలెట్‌ లో మధ్యంను తరలిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు పంజాణి మండలం బాలేపల్లె వద్ద పట్టుకున్నామన్నారు. మధ్యం విలువ రూ.67,500 లుగా తెలిపారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించామన్నారు. కర్నాటక సరిహద్దు ప్రాంతంలో నిఘాతీవ్రం చేశామని , అక్రమవ్యాపారుల ఆట కట్టిస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్‌ఈబి అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్మెంట్‌ సూపరింటెండెంట్‌ అయిషాబేగం, ఇన్‌స్పెక్టర్‌ సీతారామిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Car possession in Punganur with Karnataka Madhyam – Two persons arrested

Post Midle