పెరగనున్న కార్ల ధరలు

ముంబై  ముచ్చట్లు:


ప్రస్తుతం అన్నింటి ధరలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం, నిత్యవసర సరుకుల ధరలు పెరగడం భారంగా మారుతున్న తరుణంలో ఇప్పుడు కార్ల ధరలు కూడా పెరుగుతాయన్న వార్తల నేపథ్యంలో వాహనదారులను ఆందోళనకు గురి చేస్తోంది.అన్ని వస్తువుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడికి భారంగా మారుతోంది. దేశంలో పండుగల సీజన్ ప్రారంభం కాకముందే వాహనాల ధరలు మరోసారి పెరిగే అవకాశం కనిపిస్తోంది. నివేదికల ప్రకారం.. మునుపటి ధరల పెంపులో ఆటో కంపెనీలు పెరిగిన ధరను పూర్తి స్థాయిలో వినియోగదారులపై బారం మోపలేదు.అయితే ఇప్పుడు వాహనాల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. పండుగల సీజన్ ప్రారంభానికి ధరలు పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.టైర్లు, ఇతర ఆటో పరికరాల ధరలను కూడా పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా ముడిసరుకుల ధరలు, ఇతర పరికరాల ధరలు పెరగడం వల్ల వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉంది.

 

Tags: Car prices to rise

Leave A Reply

Your email address will not be published.