Natyam ad

పుంగనూరులో సంక్షేమానికి కేరాఫ్‌ జగనన్న

పుంగనూరు ముచ్చట్లు:

పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి వారికి కేరాఫ్‌గా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము తెలిపారు. సోమవారం ఉబేదుల్లా కాంపౌండులో సంతలో ఆయన ప్రచారం చేపట్టారు. ప్రతి అంగడిలోను , సంతకు వచ్చిపోయే వారికి కరపత్రాలు పంపిణీ చేసి, రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేయాలని కోరారు. అలాగే అతిపెద్ద వార్డుగా ఉన్న నక్కబండలో కౌన్సిలర్‌ మనోహర్‌, పట్టణ మైనార్టీ సెల్‌ కార్యదర్శి ఖాదర్‌బాషా కలసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. అలాగే ఏటిగడ్డపాళ్యెంలో బలిజ సంఘ పట్టణ నాయకురాలు కొండవీటి మాధురి, కొండవీటి నరేష్‌లు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే కౌన్సిలర్లు నరసింహులు, అర్షద్‌అలి, జయభారతి, మమత, రేష్మా, జెపి.యాదవ్‌, సాజిదాబేగం, శోభారాణి లు తమతమ వార్డులలో ప్రచారాలు నిర్వహించారు. ఈ ప్రచారాలలో నాయకులు మహబూబ్‌బాషా, రమణ, లక్ష్మణరాజు, మురళి, జావీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Caraf Jagananna for welfare in Punganur

Post Midle