కాలువలో మృతదేహం

రాజమండ్రి  ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా గోకవరం లోని తంటికొండ  ఊరి చివర లో గల బది రెడ్డి చెరువు… గాదెల పాలెం ఇసుకపల్లి వారి చెరువుకు పోయె కళింగ కాలువలో బుచ్చమ్మ గుడి వద్ద శనివారం గుర్తుతెలియని మృత దేహం నీటిలో తేలింది. విషయాన్ని తంటికొండ విఆర్వో పండు దొర పోలీసు లకు ఫిర్యాదు చేసారు. గోకవరం స్థానిక ఎస్.ఐ పి చెన్నారావు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడ స్థానికులను విచారించగా ఇక్కడకు కొంతమంది చేపల వేటకు వస్తారని స్థానికులు తెలిపారు. కాలుజారి పడి ఉండవచ్చని … వ్యక్తి వివరాలు తెలియవలసి ఉందని ఎస్ ఐ పి చెన్నారావు  తెలిపారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Carcass in the canal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *