ప్రజల రక్షణ, భద్రతాభావం కలిగించడం కోసమే కార్డెన్ అండ్ సర్చ్

Date;27/02/2020

ప్రజల రక్షణ, భద్రతాభావం కలిగించడం కోసమే కార్డెన్ అండ్ సర్చ్

ఈరోజు నర్సాపూర్ (జి) పోలీస్ స్టేషన్ పరిధిలోని చాక్ పెల్లి గ్రామంలో పోలీస్ కార్డాన్ సర్చ్ జిల్లా ఎస్పీ .సి.శశిధర్ రాజు  ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో సరైన పత్రాలు లేని 45

మోటారు సైకిలు, తొమ్మిది ఆటోలు,  ఒక ట్రాక్టర్, అనుమతి లేని మద్యం, రూ 3180/- స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ  గ్రామ ప్రజలతో మట్లాడుతూ ప్రజల రక్షణ గురించి ప్రజలకు  భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని, గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ  వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని,  నేర రహిత గ్రామలుగా చేయలనే ఉద్దేశ్యం గురించి కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపినారు.

మరియు అత్యాధునిక టెక్నాలజీ టీఎస్ కాప్ అధునాతన యాప్ ద్వారా ఫేషియల్ రికగ్నషన్ సిస్టం ద్వారా అనుమానితుల ఫోటో తీసి చెక్ చేయడం ద్వారా ఎవరైనా పాత నేరస్తులు నేరం

చేసి ఉంటే వెంటనే వారి ఫోటో వారి బయోడేటా వారు చేసిన నేరం వివరాలు క్షణంలోనే తెలిసిపోతాయి పాత నేరస్తుల ఫోటోలు తీసి మరియు ఫింగర్ ప్రింట్ ద్వారా చెక్ చేయడం జరిగిందని

తెలిపినారు. నేనుసైతం అనే కార్యక్రమం ద్వారా గ్రామాలలోని ప్రజలు, వ్యాపారస్తులు, గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ యూనియన్ నాయకులు, ఉద్యోగులు, సీసీ

కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పోలీస్ శాఖకు సహకరించాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన అమాయకులైన ప్రజలను కేసుల నుండి రక్షించవచ్చు, మరియు

గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చునని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్.సి, ఇన్సూరెన్స్, మరియు డైవింగ్ లైసెన్స్

కలిగివుండాలని తెలిపారు, మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ఈ మధ్యకాలంలో హెల్మెట్ లేక కొందరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగిందని

హెల్మెట్ భారంగా కాకుండా బాధ్యతగా భావించి ధరించాలని సూచించారు.
పాత వాహనాలు కొనేటప్పుడు వాటి యొక్క డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని కొనాలని డాక్యుమెంట్స్ లేని వాహనాలను

కొనుగోలు చేయవద్దని తెలిపినారు. కాలనీలో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసులు ఫోన్ చేయాలని లేదా నిర్మల్ జిల్లా వాట్స్అప్ నెంబర్

8333986939 లేద డయల్ 100 కాల్ కు  ఫోన్ చేసినాచో వెంటనే చర్యలు చేపడతాం అని యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచిగా చదువుకొని వారి

తల్లిదండ్రులకు మరియు వారి ప్రాంతానికి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ప్రజలను రక్షించడానికే తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుముఖం ప్రజలకు మరింత రక్షణ

కల్పించవచ్చని తెలిపినారు. ఎలాంటి పరిచయ లేని వారికి ఇల్లు కిరాయి ఇవ్వవద్దని తెలిపినారు. కార్డాన్ అండ్ సెర్చ్ లు తరుచుగా నిర్వహిస్తామని తెలిపారు.
రోజు చాక్ పెల్లి గ్రామంలో నేను

సైతం కార్యక్రమంలో సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ శ్రీ.సి.శశిధర్ రాజు గారు ప్రారంభించారు.

ఈ తనిఖీలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, డి.యస్.పి ఉపేందర్ రెడ్డి, సి.ఐ.లు, జాన్ దివాకర్,

జీవన్ రెడ్డి, ఎస్.ఐ.లు మరియు 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags;Carden and Search is for the protection and protection of the public

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *