Natyam ad

ఆడ పిల్లల సంరక్షణ అవసరం -సూపర్‌వైజర్‌ అరుంధతి

పుంగనూరు ముచ్చట్లు:

ఆడపిల్లల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఐసిడిఎస్‌ సూపర్‌ వైజర్లు అరంధతి, కల్పనలు కోరారు. మంగళవారం మండలంలోని వనమలదిన్నె హైస్కూల్‌లో అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అరుంధతి మాట్లాడుతూ ప్రస్తుతం ఆడపిల్లల ఎదుగుదల దక్కిందన్నారు. ప్రతి ఒక్కరు మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడ సమాజానికి ఎంతో అవసరమని, ఆడపిల్లల సంరక్షణ చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఆటలపోటీలు నిర్వహించి, బహుమతులు పంపిణీ చే శారు. ఈ కార్యక్రమంలోహెచ్‌ఎం నాగరాజారెడ్డి, ఉపాధ్యాయురాలు శారద, భవాని, జ్యోతిలక్ష్మీ, హేమావతి, గాయిత్రి, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags; Care of female child needed -Supervisor Arundhati

Post Midle