Natyam ad

పుంగనూరులో పశువులకు వచ్చే వ్యాదులపై జాగ్రత్తలు తీసుకోవాలి

పుంగనూరు ముచ్చట్లు:

రాబోవు కాలంలో పశువులకు వచ్చే వ్యాదులపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జెడి డాక్టర్‌ ఎం.ప్రభాకర్‌ సూచించారు. శనివారం ఆయన స్థానిక ఏడి డాక్టర్‌ మనోహర్‌ తో కలసి పశువైధ్యాధికారులు, సిబ్బందితో కలసి సమావేశం నిర్వహించారు. జెడి మాట్లాడుతూ వర్షాకాలంలో పశువులకు, గొర్రెలకు, మేకలకు రకరకాల వ్యాదులు సోకే ప్రమాదం ఉందన్నారు. వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వ్యాదులు గురించి తెలిసిన వెంటనే వ్యాది సోకిన పశువులకు , చుట్టు ప్రక్కల గ్రామాలలోని పశువులకు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిని పరిశీలించి , రికార్డులు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

 

Post Midle

Tags; Care should be taken against cattle diseases in Punganur

Post Midle