పట్టించుకునే నాథుడేడి..? 

Date:16/04/2018
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
జిల్లాలో చిన్ననీటి పారుదలశాఖ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు రూ.12.50 కోట్ల పనులు చేయించాల్సి ఉండగా పర్యవేక్షకులు కరవయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 43 ఎత్తిపోతల పథకాలు వికారాబాద్‌లో రెండు ఎత్తిపోతల పథ]కాలను జిల్లా కేంద్రం నుంచే పర్యవేక్షించాలి. జిల్లాలో 41 ఎత్తిపోతల పథకాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి మరో రెండు పథకాల పనులు (అలంపూర్‌, క్యాతూరు) ప్రారంభం కావాల్సి ఉంది.
జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ఐడీసీ కార్యాలయం మక్తల్‌లో నిర్వహించేవారు. 15 ఏళ్ల కిందట మక్తల్‌ కార్యాలయం అధికారులతో కళకళలాడేది. ప్రస్తుతం అధికారులు లేక మూత పడింది. ప్రతి మూడు పథకాలకు ఒక ఏఈ ఉండాలి. కాగా 43 పథకాలకు ప్రస్తుతం ఒకే ఒక్క ఏఈ ఉన్నారు. ఆయనే ఏఈ, డీఈ విధులు నిర్వహించాలి. అలాగే ప్రస్తుతం ఎత్తిపోతల పథకాల మరమ్మతులు జరుగుతున్నాయి. పనులను పర్యవేక్షించడానికి ఒక్క అధికారి పనులు జరిగే చోట ఉండటం లేదు. పథకాల ఛైర్మన్‌లు గుత్తేదారులు కలసి పనులు చేసుకుంటున్నారు. దీంతో పనుల్లో నాణ్యత పరిశీలించేవారు కరవయ్యారు.
జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ప్రస్తుతం ఒక అకౌంటెంట్‌, ఎలక్ట్రీషియన్‌ మాత్రమే ఉన్నారు. ఆయనతో పాటు ఒక ఏఈ. ఈ ఇద్దరూ ఆగస్టు నెలకు  పదవీ విరమణ పొందనున్నారు. దీంతో కార్యాలయంలో ఈఈ, (మొదటిపేజీ తరవాయి) అకౌంటెంట్‌ తప్ప ఇంకెవరూ మిగలని పరిస్థితి నెలకొంది.
Tags:Cared nathadi ..?

Cared nathadi ..?
Cared nathadi ..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *