బండికి ప్రాబ్లమ్స్ షురూ…

Date:23/01/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

బండి ఎప్పుడూ ఒకే స్పీడ్ తో ర‌య్యి ర‌య్యిన వెళ్లాలంటే ఎలా.. గ‌తుకుల రోడ్లు వ‌స్త‌య్. ముళ్ల బాట‌లు వ‌స్త‌య్. బండికి ప్రాబ్ల‌మ్స్ వ‌స్త‌య్. ఒక్కోసారి భారీ రిపేర్లు చేయాల్సి వ‌స్తుంది. ఒక్కోసారి ప‌క్కన పెట్టేసి.. బండి దిగి నుంచోవాల్సి కూడా వ‌స్తుంది. బండి సంజ‌య్ కి ఇప్పుడు బీజేపీ బండిని లాగించ‌డం ఎంత క‌ష్ట‌మో తెలిసి వ‌స్తోందంట‌. ఎందుకంటే.. త‌ను మామూలు లీడ‌ర్ అయితే.. బండేసుకుని లాగించేయొచ్చు. కానీ.. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు కావ‌డంతో.. ఇంట‌ర్న‌ల్ పాలిటిక్స్ ని కూడా చూసుకోవాలి. ఒక్కో లీడ‌ర్ ఎన్నో ఆశ‌ల‌తో వ‌స్తారు. ఇక బీజేపీ టైం ముందుంది అని ఫీల్ అవుతున్నారు కాబ‌ట్టి.. ఇంకా ఎక్కువ ఆశ‌లు ఉంట‌య్. ఎదిగే పార్టీలో మంచి ప‌ద‌వి ఇప్పుడు ద‌క్కించుకుంటే.. ముందు ముందు వ్యాల్యూ పెరుగుతుంది. మ‌న‌మే ఎదుగుద‌ల‌కు హెల్ప్ అయ్యాం అనే క్రెడిట్ ద‌క్కుతుంది అని అంద‌రూ అనుకుంటారు క‌దా.

 

 

అందుకే.. అంతా పార్టీ ప‌ద‌వుల కోసం చూస్తున్నారు.ఏడాది తిర‌క్కుండానే బండి సంజ‌య్ కి పార్టీలో వారిని బుజ్జ‌గించాల్సిన టైం వ‌చ్చింది. క‌రోనా కార‌ణంగా లేట్ అయినా.. బీజేపీ అనుబంధ మోర్జాల‌కు మాత్రం లాస్టియ‌ర్ సెప్టెంబ‌ర్ లో అధ్య‌క్షుల‌ను ప్ర‌క‌టించారు. అంతా ఓకే. కానీ.. ఇప్పుడు ముందున్న‌య్ అస‌లు ప్రాబ్ల‌మ్స్. మోర్జాలు ఓకే అయినా.. పూర్తిస్థాయిలో క‌మిటీలు మాత్రం వేయ‌లేదు. సో.. పార్టీ ప‌ద‌వుల కోసం ఎదురు చూపులు త‌ప్ప‌డం లేదు. మొద‌టి రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశంలో కూడా అన్ని క‌మిటీల ఎవ్వారం కొలిక్కి రాలేదు. కార్య‌వ‌ర్గం లేకుండా రాష్ట్ర స్థాయి స‌మావేశం నిర్వ‌హించ‌డంపై పార్టీ నేత‌లు హ‌ర్ట్ అవుతున్నార‌ట‌. అఫ్ కోర్స్ వ్య‌తిరేక‌త కూడా స్టార్ట్ అయింద‌ట‌.

 

 

రాష్ట్ర కార్య‌వ‌ర్గం నియామ‌కంపై మాత్రం చాలా సైలెంట్ గా ప‌నులు న‌డుస్తున్నాయ‌ట‌. కార్య‌వ‌ర్గంలో ఎవ‌రికి చోటు ద‌క్కుతుంది. ఎవ‌రికి చోటు ద‌క్క‌దు అనే విష‌యంపై లీడ‌ర్లు సీరియ‌స్ గానే ఉన్నార‌ట‌. కమిటీలు ఏర్పాటు చేయ‌నికాడికి కార్య‌వ‌ర్గం మీటింగ్ కి ఎందుకు పిలిచారు. య‌ట్ లీస్ట్ వ‌చ్చిన వారికి వివ‌రాలు అయినా తెలియాలి క‌దా. మీటింగ్ ని ర‌హ‌స్యంగా ఏర్పాటు చేయ‌డం.. సైలెంట్ గా అంద‌రినీ పిల‌వ‌డం. అది కూడా ముందు రోజు మెస్సేజ్ లు ఇవ్వ‌డం ఏంటి అని ప్ర‌శ్నిస్తున్నార‌ట‌. చూస్తుంటే.. పార్టీ ప‌ద‌వుల ఎవ్వారం.. బండి సంజ‌య్ స్పీడ్ కి బ్రేకులు వేసేలాగా ఉంది.

పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి

Tags: Cart Problems Start …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *