మాజీ మంత్రులపై కేసు నమోదు

Date:23/01/2020

అమరావతి ముచ్చట్లు:

అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై కేసు నమోదు పై  సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా  మంగళగిరి టౌన్ పోలీసు స్టేషన్ లో మీడియాతో మట్లాడారు. మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, బెల్లంకొండ నరసింహాల పై కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. మభ్యపెట్టి తనభూమి కొనుగోలు చేసారని వెంకటాయపాలెం  దళిత మహిళ పోతురాజు బుజ్జి పిర్యాదు చేసింది. .99 సెంట్లు కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడైందని ఆమె అన్నారు. 420 ,506 ,120 b ,ఐపీసీ సెక్షన్  3 కింద కేసు నమోదు చేసామని ఆమె అన్నారు. సీఐడీ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 797  తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్ భూములు కొన్నట్టు నిర్ధారణ అయింది. రూ.3 కోట్లకు చొప్పున ఎకరం భూమి తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించామని అన్నారు.

 

 

 

 

 

రూ.220 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించాం. తెల్లరేషన్ కార్డు హోల్డర్స్‌తో కొనుగోలు చేయించిన వారి వివరాలపై ఆరాతీస్తున్నాం. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసాం.  అమరావతిలో 129 ఎకరాలు  131 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ కొనుగోలు చేసారని ఆమె అన్నారు.  పెద్దకాకానిలో 40 ఎకరాలు  43 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ కొన్నారు. తాడికొండలో 190 ఎకరాలు  188 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ రిజిస్టర్ చేసుకొన్నారు. తుళ్లూరులో 242 ఎకరాలు  238 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ కొన్నారు. మంగళగిరిలో 133 ఎకరాలు  148 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్,  తాడేపల్లిలో 24 ఎకరాలు  49 మంది తెల్లరేషన్ కార్డు హోల్డర్స్ కొన్నారు. విచారణ మరింత వేగవంతం చేస్తామని ఆమె అన్నారు. తనపై కేసు నమోదు చేసిన విషయాన్ని గురించి తెలుసుకున్న నారాయణ స్పందిస్తూ… కక్షతోనే తమపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.

నాణ్యమైన విత్తన వంగడాలను అందించాలి

Tags: Case against former ministers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *