భార్యపై హత్యప్రయత్నం చేసిన భర్తపై కేసు నమోదు

Date:21/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

కట్టుకున్న భార్యపై హత్యప్రయత్నం చేసి, వరకట్నం వేదింపులకు గురి చేసిన భర్తపై భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని చింతలవీధిలో నివాసం ఉన్న అనూషకు సదుంకు చెందిన వినోద్‌తో ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగింది. వీరికి ముగ్గరు పిల్లలు . ఇలా ఉండగా వినోద్‌ ఉద్యోగ రీత్యా దక్షిణాఫ్రికాకు వెళ్లి గత ఏడాది తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేదిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఈనెల 17న అనూష పుంగనూరుకు వచ్చింది. వినోద్‌ పుంగనూరుకు వచ్చి అనూషను చంపేందుకు గొంతునులిమి ప్రయత్నించాడు. దీనిని గ మనించిన కుటుంబ సభ్యులు అనూషను కాపాడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు వినోద్‌, వారి కుటుంబ సభ్యులు విక్రమ్‌, అత్తమామలు నాగభూషణం, గిరిజాకుమారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మంచినీటి సమస్య లేకుండ చేస్తాం

Tags: Case filed against husband for attempted murder of wife

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *