24 గంటల్లో మిస్టరీ హత్య కేసు చేదింపు

మద్యం సీసా పై ఉన్న స్టిక్కర్ తో హత్యను చేదించిన బద్వేలు రూరల్ పోలీసులు
ఇద్దరు హంతకుల అరెస్టు
మైదుకూరు డిఎస్పి వంశీధర్ గౌడ్
బద్వేలు రూరల్ సి ఐ హనుమంతు నాయక్

బద్వేలు ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపాలునిపల్లే గ్రామానికి చెందిన దేవభూషణం సునీత భార్యాభర్తలు. వీరికి 8 సంవత్సరాల వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు. ఉపాధి నిమిత్తం గత కొంత కాలంగా కడపలో వీరి కుటుంబం నివాసం ఉంటుంది. బద్వేలు మండలం కొత్తచెరువు గ్రామానికి చెందిన గొడుగునూరు నారాయణతో ఈ కుటుంబానికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త దేవభూషణం భార్య సునీతతో నారాయణకు అక్రమ సంబంధం ఏర్పడింది. వీరి అక్రమ సంబంధం చాలాకాలం నడిచింది. కొంతకాలానికి ఈ విషయం దేవా భూషణానికి తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడ్డాయి.  తరచూ గొడవలు జరుగుతుండడంతో ఈ విషయాన్ని సునీత నారాయణకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దేవ భూషణంను హతమార్చేందుకు ఇద్దరు ఒక పన్నాగం పన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు మైదుకూరు డిఎస్పి వంశీధర్ గౌడ్ బద్వేలు రూరల్ సీఐ హనుమంతు నాయక్ సోమవారం మధ్యాహ్నం రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో విలేఖర్లకు వివరించారు గత నెల 27వ తేదీ బద్వేల్ మండలం తిప్పనపల్లె బీడు భూముల్లో దేవభూషణం (46) శవంగా మారి కనిపించాడు. మృతదేహం ఎవరిదో తెలియక పోవడంతో విఆర్ఓ విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు బద్వేలు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ  కేసు పోలీసులకు సవాలుగా మారింది. జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు మైదుకూరు డిఎస్పి వంశీధర్ గౌడ్ ఆధ్వర్యంలో బద్వేలు రూరల్ సీఐ హనుమంతు నాయక్ రూరల్ ఎస్సై చంద్రశేఖర్ వారి సిబ్బంది విచారణ చేపట్టారు.

 

 

 

దేవ్ భూషణం మృతదేహం పక్కన మద్యం సీసా ఉండడం దాని పై ఉన్న స్టిక్కర్ ఆధారంగా మద్యం ఎక్కడ కొనుగోలు చేసింది విచారించారు. మద్యం సిద్ధవటం లోని ఒక  షాపులో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం తన మరదలు  సౌదీ కి వెళుతుందని ఈ సందర్భంగా పార్టీ ఇస్తున్నట్లు చెప్పి నారాయణ దేవభుషణాన్ని తన ద్విచక్ర వాహనం మీద ఎక్కించుకొని తీసుకు వచ్చాడు. సిద్ధవటములో మూడు మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి అవి తీసుకొని తిప్పనపల్లికి రావడం జరిగింది. అక్కడ దేవభుషణానికి పూర్తిగా మద్యం తాగించాడు. ఇదంతా గత నెల 26వ తేదీ జరిగింది. తర్వాత మిగిలిన మధ్యాన్ని అదే రోజు రాత్రి ఎర్ర వంక పక్కన కూర్చొని సాధించాడు. దీంతో పూర్తి మద్యం మత్తులో ఉన్న దేవ భుషణాన్ని ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అతని తలపై బండరాయివేసి హతమార్చాడు. అక్కడి నుంచి నారాయణ వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు దేవ భూషణం హత్య విషయం వెలుగు చూసింది. పోలీసులు అట్లూరు ం సిద్ధవటం మధ్య ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా హత్య చేసిన నారాయణను కేవలం 24 గంటల్లో పట్టుకున్నారు. సోమవారం ఉదయం వెంకట శెట్టి పల్లె తిప్పన పల్లె మార్గమధ్యంలో పట్టుకున్నట్లు డి.ఎస్.పి వంశీధర్ గౌడ్ తెలిపారు. రెండు రోజులు ముందే దేవా భూషణం భార్య సునీతను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు వారు తెలిపారు. హత్య కేసును కేవలం 24 గంటల వ్యవధిలో చేదించిన బద్వేల్ సిఐ హనుమంతు నాయక్ రూరల్ ఎస్సై చంద్రశేఖర్ వారు సిబ్బందిని జిల్లా ఎస్పీ మైదుకూర్ డిఎస్పిలు ప్రత్యేకంగా అభినందించారు.

 

Tags: Case of mystery murder in 24 hours

Leave A Reply

Your email address will not be published.