నారా లోకేష్ పై కేసు నమోదు

విజయవాడ ముచ్చట్లు :

 

 

కరోనా నిబంధనలు ఉల్లం ఘించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విజయవాడ సూర్యారావు పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గతేడాది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ సందర్భంగా పరామర్శ కోసం లోకేష్ సూర్యారావు పేట కోర్ట్ సెంటర్ కు వెళ్లారు. చట్టం ప్రకారం కరోనా వ్యాప్తికి కారణమయ్యారంటూ లోకేష్ తో పాటు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర , అధికార ప్రతినిధి పట్టాభి, తెలుగు యువత నేత దేవినేని చందు పై పోలీస్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గతేడాది జూన్ 12 న ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Case registered against Nara Lokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *