సుండిపెంట వెళ్లకుండా శ్రీశైలం వెళ్తున్న బస్సుల డ్రైవర్ కండక్టర్ల పై కేసులు
శ్రీశైలం ముచ్చట్లు:
శ్రీశైలం ప్రాజెక్టు సి పి ఐ, ఏ ఐ టి యు సి,ఏ ఐ వై ఫ్ నాయకుల ఆధ్వర్యంలో వారం రోజులుగా ముఖ ద్వారం వద్ద ఉండి బయటి ప్రాంతాల నుండి సుండిపెంట మీదుగా శ్రీశైలం వెళ్ళవలసిన ఆర్టీసీ బస్సులు సుండిపెంట రాకుండా నేరుగా శ్రీశైలం వెళ్తున్న బస్సుల నెంబరు నమోదు చేసుకుని. ఏపీఎస్ఆర్టీసీ శ్రీశైలం బస్ స్టేషన్ మేనేజర్‌కు తెలియజేయడంతో వారు ప్రత్యేక బృందాలను. (స్క్వాడ్) పంపించడం జరిగింది శుక్రవారం రోజు ఉదయం సిపిఐ,ఏఐటీయూసీ,ఏ ఐ వై ఫ్ నాయకులతో పాటు ఏపిస్ ఆర్ టి సి స్క్వాడ్ రికార్డు అధికారులు. శ్రీనివాస్ మరియు గౌడ్ తో ముఖ ద్వారం వద్ద విజయవాడ డిపోకు చెందిన ఏ పి16జెడ్0732 బస్సు సున్నిపెంట రాకుండా నేరుగా శ్రీశైలం వెళ్లడంతో స్థానిక సిపిఐ, ఏఐటీయూసీ, ఏ ఐ వై ఫ్ నాయకులు బస్సును ఆపడంతో అధికారులు డ్రైవర్ కండక్టర్ ల పై కేసు నమోదు చేయడం జరిగినది ఇకనైనా ఆర్టీసీ బస్సు కండక్టర్లు డ్రైవర్లు బస్సులు సుండి పెంట మీదుగా వెళ్లాలని సిపిఐ,ఏఐటీయూసీ, ఏ ఐ వై ఫ్ నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు టి.మల్లికార్జున,జాఫర్ అలి, టి.వెంకట్,కాశీ,తదితరులు పాల్గొన్నారు.
Tags: Cases against bus driver conductors going to Srisailam without going to Sundipenta

