Natyam ad

రిపోర్టర్ల పై కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి-కామనురు. శ్రీనువాసులు రెడ్డి

కడప ముచ్చట్లు:

 

శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో నలుగురు రిపోర్టర్ల పై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కామనురు. శ్రీనువాసులురెడ్డి  ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కదిరి పట్టణంలో రెండు రోజుల క్రితం జరిగిన హింసాత్మక ఘటనలు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను కవర్ చేస్తున్న విలేఖర్ల పై పోలీసులు తప్పుడు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటన లో పేర్కొన్నారు.  మహిళ కౌన్సిలర్ పై సీఐ తమ్మిశెట్టి మధు వ్యాఖ్యల కు నిరసన తెలపడానికి వెళ్లిన మహిళలపై  లాఠీ ఛార్జ్ జరిగిన ఘటన కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూ దాడి చేయడమే కాకుండా పోలీస్ కేసులను నమోదు చేయడం దుర్మార్గమని తెలిపారు. రిపోర్టర్ల నుంచి సెల్ ఫోన్లు లాక్కొని, దాడికి పాల్పడిన పోలీసులపై తక్షణమే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.   సీఐ వ్యవహారం పై ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. కదిరిలో మీడియా ప్రతినిధులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోకపోతే , రిపోర్టర్ల చేయు ఆందోళన కార్యక్రమాలు సిఐటియు సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు.

 

Tags: Cases against reporters should be withdrawn immediately-Kamanuru. Srinuvasulu Reddy

Post Midle
Post Midle