కేసులు, అరెస్టులు, టిడిపి ఉద్యమాన్ని, ఎవరు అడ‌్డుకోలేవు…
రెట్టింపు ఉత్సాహంతో పని చేద్దాం…నాని
మన పోరాటంలో పవన్ కళ్యాణ్ కూడా కలవటంతో రెట‌్టింపు బలం…
వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం

చంద్రగిరి కోట పైన పసుపు జెండా ఎగరడం ఖాయం…
“బాబుతో నేను సైతం” పులివర‌్తి నాని
చంద్రగిరి ముచ్చట్లు:
చంద్రగిరి కేసులు అరెస్టులతో టీడీపీ శ్రేణులను భయపెట్టాలని, అడ్డుకోవాలని, కేసులు పెడతామని చూస్తే అది సాధ్యం కాదని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర‌్తి నాని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ రాష్ట్ర అధినాయకత్వం పిలుపుమేరకు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో 4వ రోజైన శనివారం రామచంద్రాపురం మండల పార్టీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు,యువత వందలాది మంది పాల‌్గొన‌్నారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద నిర్వహించిన “బాబుతో నేను సైతం” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సప్తగిరి ప్రసాద్ సంఘీభావం తెలిపారు. పలువురు నాయకులు వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ చంద్రబాబును అరెస్టు చేయడం వల్ల టిడిపి శ్రేణులు భయపడతారన్న అపోహలో వైసీపీ నాయకులు ఉన్నారని వారు ఎంత అణిచివేసే ధోరణితో ప్రవర్తిస్తే అంతే వేగంతో మనం ముందుకు దూసుకెళ్తామన‌్నారు.
ఇప్పటికే చంద్రబాబు అరెస్టు తర్వాత చాలామంది ఆవేదనతో చనిపోయారని ఇలాంటి పరిస్థితుల్లో టిడిపి నాయకులంతా వారి వద్దకు వెళ్లి ధైర్యం చెప్పాలన్నారు. చంద్రబాబు అరెస్టయినా కడిగిన ముత్యం లాగా బయటికి వస్తారని, అందరికీ ధైర్యాన్ని ఇవ్వాలని సూచించారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఎన్నో కుట్రలు పన్ని టిడిపిని దెబ్బతీయాలని చూసారని కానీ అది చేతకాక ఇప్పుడు అరెస్టులు చేయించారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఇటు చంద్రబాబు అటు లోకేష్ పోరాటాలు చేయడం వల్ల వైసిపి వారు ఆందోళన చెంది చివరకు ఈ విధంగా అక్రమ కేసులు పెట్టారన్నారు. ఇవి రేపు ఛట‌్టం ముందు, కోర్టులో నిలబడే పరిస్థితి ఉండదని చెప్పారు. చంద్రబాబు నిజాయితీ ఏంటన్నది ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా ప్రపంచ మంతా తెలుస్తుందన్నారు. అందుకే ఇప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి చంద్రబాబుకు మద్దతు లభిస్తోందన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసి సుదీర్ఘకాలం ప్రతిపక్షనేతగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపితే, భవిష్యత్తులో ఇప్పుడు ఇష్టానుసారంగా దందాలు చేస్తున్న వైసీపీ నాయకుల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు కోవాలని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేనతో కలసి వైసీపీని 175 స్థానాల్లో ఓడిస్తామని మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఇప్పుడు విర్రవీగుతున్న నాయకులం దరికీ ముందుంది ముసళ‌్ళ పండుగ అన‌్నారు.
న‌్యాయం జరిగే వరకు పోరాడుదాం: ఓ మహిళా కార‌్యకర‌్త
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ, న‌్యాయం జరిగి, విడుదల అయ్యేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని ఓ మహిళా కార్యకర్త పిలుపునిచ్చారు. అవినీతి, సహజవనరుల దురాక్రమణ, దౌర్జన్యాలతో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. అవినీతిపరులు రాష్ట్ర మేలుతుంటే, నీతి పరులు జైలులో వున్నారని ఇదేమి నీతి,ఇదెక‌్కడి ధర‌్మం అని ప్రశ్నించారు.ఇది రాజారెడి అధర‌్మ రాజ‌్యంగం 420 ప్రకరణలోనిదా అంటూ విమర్శలు చేశారు.
తుగ్లక్ లాంటి తప‌్పుడు విధానాలు,హిట్లర్ లాంటి నియంత పరిపాలన గురించి పుస్తకాల్లో చదువుకున్నామే,కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా జగన్ పాలనలో మనం చూడాల‌్సి రావటం ఈ రాష్ట్ర ప్రజలుగా మనం చేసుకున్న దౌర్భాగ్యమన‌్నారు.దీనికంతటికి విరుగుడు 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించట ఘంటాపథం ఆ మహిళ ఆవేదనతో కూడిన ఆలోచనతో కలిసిన ప్రసంగం చేశారు.చంద్రబాబుకు అండగా నడుంకట‌్టిన చంద్రగిరి ఎమ్మెల్యే అభ‌్యర‌్తి పులివర్తి నాని ఆశయ సాధన కోసం తాము సైతం అంటూ రామచంద్రాపురం మండల నాయకులు, మహిళలు ప్రకటించారు.
Tags:Cases, Arrests, TDP Movement, Who Can’t Stop…
