తప్పుడు ఆరోపణలతో కేసులు

Date:12/06/2019

గుంటూరు ముచ్చట్లు:

తన కుమారుడు, కుమార్తెలపై నమోదవుతున్న కేసులపై ఏపీ  మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పందించారు. బుధవారం అయన గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తన కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టుకుంటూ పోతున్నారని, ఇప్పటికే ఏడెనిమిది కేసులు పెట్టారని ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలపై ఒక్క ఆధారం చూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
తన కుమారుడు వైద్యుడని, అయనకు గౌతం హీరో షోరూం పేరుతో ద్విచక్ర వాహనాల షోరూం ఉందని పేర్కొన్నారు. తన కుమారుడిని హీరో సంస్థ ఉత్తమ పారిశ్రామికవేత్తగా గుర్తించిందని కోడెల తెలిపారు. కేసులకు బెదిరిపోబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం మంచి చేస్తే తాము కూడా మద్దతు ఇస్తామని, కానీ ఇలాంటి బెదిరింపు ధోరణి సరికాదని హితవు పలికారు. అధికారం అడ్డుపెట్టుకుని వేధిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ప్రతిపక్షం అసెంబ్లీని బహిష్కరించినప్పుడు సభకు రావాలని చాలా సార్లు విజ్ఞప్తి చేశానని అయన  గుర్తుచేశారు.

నకిలీ నక్సలైట్ల కలకలం

Tags: Cases of false accusations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *