Cases on sale of goods at high prices in Anantapur - Swamy

అనంతపురంలో అధిక ధరలకు సరుకుల విక్రయాలపై కేసులు – స్వామి

అనంతపురం ముచ్చట్లు:

Date:03/05/2020

కరోనా నియంత్రణలో లాక్‌డౌన్‌ను ఆసరాగా చేసుకున్న వ్యాపారులు అధిక ధరలతో ప్రజలను దోపిడి చేస్తుండగా అనంతపురంలోని ఎస్‌పి సూపర్‌స్టోర్‌లో తూనికలు, కొలతల శాఖా అసిస్టెంట్‌ కంట్రోలర్‌ స్వామి, ఇన్‌స్పెక్టర్‌ మహమ్మద్‌గౌస్‌తో పాటు ఆహార కల్తీ నిరోధకశాఖ ఇన్‌స్పెక్టర్‌ కరీముల్లా, రాష్ట్ర విజలెన్స్ కమిటి మెంబర్‌ రవీంద్రనాథరెడ్డి, ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ కమిటి మెంబర్‌ పి.క్రిష్ణమూర్తి కలసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెల రోజుల లాక్‌డౌన్‌లో ప్రజలకు నిత్యవసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడి చేస్తున్నట్లు గుర్తించారు. వీటితో పాటు నాణ్యమైన సరుకులను విక్రయించకుండ కల్తీ వస్తువులను తక్కువ తూకాలతో విక్రయాలు చేపడుతున్నట్లు అధికారుల బృందం గుర్తించింది. ఈ విషయమై అసిస్టెంట్‌ కంట్రోలర్‌ స్వామి మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు వ్యాపారులు ప్రభుత్వం నిర్ధేశించి ధరలకు మాత్రమే నిత్యవసర వస్తువులు విక్రయించాల్సి ఉండగా ఇందుకు విరుద్ధంగా అనంతపురం పట్టణంలో కొంత మంది వ్యాపారులు విక్రయాలు చేపట్టడంపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో తనిఖిలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు సుమారు 100 షాపులను తనిఖీ చేసి, షాపు యజమానులకు జరిమానాలు విధించామన్నారు. అలాగే కేసులు నమోదు చేశామన్నారు. లాక్‌డౌన్‌ను ఆసరాగా చేసుకుని అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

నక్షత్ర తాబేలు అప్పగింత

Tags: Cases on sale of goods at high prices in Anantapur – Swamy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *