మళ్లీ నగదు కష్టాలు

Cash backs again

Cash backs again

Date:15/02/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ఏటీఎంలు ఖాళీ! ప్రజల అవస్థ నగదు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. నగదు కోసం ప్రజలు ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. చాలా బ్యాంకుల ఏటీఎంలు మూతపడ్డాయి. కొన్నిచోట్ల ‘నో క్యాష్‌’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నగదు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నగరాల్లోనే ఇటువంటి పరిస్థితి ఉంటే పల్లెల్లో పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా బ్యాంకు ఏటీఎంలో నగదు పెట్టారని తెలిస్తే చాలు.. వినియోగదారులు అక్కడ బారులు తీరుతున్నారు. రాజధాని నగరమైన విజయవాడలో బుధవారం పరిశీలిస్తే… ప్రధాన బ్యాంకుల ఏటీఎంల్లో నగదు లేకుండా పోయింది. బ్యాంకుల యందు కూడా రూ.10,000/-ల కంటే ఎక్కువ నగదు ఇవ్వడం లేదు. ప్రజలు మా డబ్బులు మాకు ఇవ్వకుండా బ్యాంకు ల చుట్టూ తిప్పుకొనుచున్నారు అని ఆగ్రహం వ్యక్తపరిస్తున్నారు. బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి నగదు ఇక్కట్లు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

 

Tags: Cash backs again

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *