తిరుమ‌ల‌లో ఆన్‌లైన్‌లో గ‌దుల బుకింగ్‌కు కాష‌న్ డిపాజిట్  

-టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి

Date:15/10/2019

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

తిరుమ‌ల‌లో ఆన్‌లైన్‌లో గ‌దులు బుక్ చేసుకునే యాత్రికుల‌కు కాష‌న్ డిపాజిట్ విధానం 2020 జ‌న‌వ‌రి నుండి అమ‌ల్లోకి రానుంద‌ని టిటిడి అద‌న‌పు ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వనంలో మంగ‌ళ‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో అద‌న‌పు ఈవో స‌మావేశం నిర్వ‌హించారు. ప‌లు అభివృద్ధి ప‌నుల ప్ర‌గ‌తిని స‌మీక్షించారు.

 

 

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లో గదుల కేటాయింపు కేంద్రాల వ‌ద్ద న‌గ‌దు ర‌హిత లావాదేవీలు క్ర‌మంగా పెరుగుతున్నాయ‌ని తెలిపారు. శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహం వ‌ద్ద 97 శాతం, ఎంబిసి వ‌ద్ద 100 శాతం స్వైపింగ్ ద్వారా లావాదేవీలు జ‌రుగుతున్నాయ‌ని వివ‌రించారు. సాధార‌ణ గదుల కేట‌గిరీలో టిబి కౌంట‌ర్‌లో 91 శాతం, స‌ప్త‌గిరి విశ్రాంతి గృహాల వ‌ద్ద 62 శాతం, సూరాపురంతోట‌, రాంభ‌గీచా, సిఆర్వో జ‌న‌ర‌ల్ వ‌ద్ద దాదాపు 50 శాతం న‌గ‌దు ర‌హిత లావాదేవీలు జ‌రుగుతున్నాయ‌ని తెలియ‌జేశారు. అనంత‌రం విభాగాల వారీగా అభివృద్ధి ప‌నుల‌పై స‌మీక్షించి ప‌లు సూచ‌న‌లు చేశారు.ఈ స‌మావేశంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో   హ‌రీంద్ర‌నాథ్‌, ఎస్టేట్ అధికారి   విజ‌య‌సార‌ధి, విఎస్‌వో   మనోహ‌ర్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

శ్రీ‌నివాస‌మంగాపురంలో అష్టోత్త‌ర శ‌త‌కుండాత్మ‌క శ్రీ‌నివాస మ‌హాయాగం

Tags: Cash deposit for booking rooms online at Thirumala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *