Cash or difficulties

Cash or difficulties

Date:21/04/2018
ఖమ్మం ముచ్చట్లు:
 ఏటీఎం అంటే ఎనీ టైం మనీ అని అర్థం.. కానీ మణుగూరులో మాత్రం ఏటీఎం అంటే మరో అర్థం కూడా ఉంది. ఏనీటైం నో మనీ అనీ, మండలంలో ఉన్న బ్యాంకులు, ఏటీఎంలలో నగదు లేదు. దీంతో లావాదేవీలు లేక ఏటీఎంలలో నగదు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తుండటంతో కరెన్సీ కష్టాలు ఏర్పడ్డాయి. కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా నగదు లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఏటీఎంల చుట్టూ తిరుగుతూ నగదు లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఎప్పుడు ఏటీఎంలలో నగదు పెడతారో అని ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఒక వేళ నగదు పెట్టినా… అది కాస్త కొద్ది సేపట్లోనే ఖాళీ అవుతుంది. దీని వలన సామాన్య ప్రజల వెతలు వర్ణణాతీతంగా మారింది. ఎలాగైనా అవసరానికి నగదు కావాలనే ఉద్దేశంతో రూ. 1000 కి రూ. 30 నుండి రూ. 50 కమీషన్ ఇచ్చి మరి నగదు తీసుకుంటున్నారు. ఏటీఎంల నగదు కొరత వలన స్వైపింగ్ సెంటర్‌ల యజమానులు లాభం పొందుతున్నారు. పెద్దనోట్ల సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డామో మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి నెలకొందని, కష్టాలు ఎప్పటికి తీరుతాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బ్యాంకుల్లో నగదు లేక చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారి ఇందులను కొంతైనా తగ్గించాలనే ఉద్దేశంతో బ్యాంకులో డిపాజిట్‌లు చేయగా వచ్చిన నగదును ఏటీఎం మిషన్‌లలో పెడుతున్నాం. అయినా ఆ నగదు సరిపోవడం లేదు. పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. ఒకవేళ బ్యాంకులో లావాదేవీలు తక్కువగా ఉంటే మాత్రం ఏం చేయలేని పరిస్థితి. బ్యాంకులలో ఎంతనగదు డిపాజిట్ అయితే అంత నగదును ప్రజల సౌకర్యార్ధం ఏటీఎం మిషన్‌లలో పెడుతున్నామన్నారు స్టేట్‌బ్యాంకు మేనేజర్ వెంకటరమణ.
Tags:Cash or difficulties

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *