Natyam ad

అభయాంజనేయస్వామి ఆలయంలో హుండీ లో నగదు చోరీ

-రెచ్చిపోయిన దొంగలు..

నెల్లూరు  ముచ్చట్లు:

మండలంలో దొంగలు ఆలయాలపై పడ్డారు. గుడుల్లోని హుండీలను, దేవుళ్ళ ఆభరణాలను చోరీ చేయడం గత కొన్ని రోజులుగా ఎక్కువైంది. తాజాగా వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయానికి ఈ పరిస్థితి ఏర్పడింది. వరికుంటపాడు లో రోజు రోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. మంగళవారం అర్థరాత్రి తూర్పు బోయమడుగుల గ్రామంలో జడ దేవి, వరికుంటపాడు,గువ్వాడి మూడు రోడ్లు కూడలి సమీపంలోని ప్రధాన రహదారి వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో చోరి జరగడం కలకలం రేపింది. ప్రతి నిత్యము అభయాంజనేయస్వామి ఆలయంకు యధావిధిగా రాత్రి పూజలు నిర్వహించి పూజారులు తాళాలు వేసి వెళ్లారు.

 

 

 

Post Midle

ఆలయంలో ఉన్న పెద్ద హుండీని గమనించిన దొంగలు ఆలయ ప్రధాన ద్వారం తాళం పగలగొట్టారు. ఆలయంలో ఉన్న హుండీలో ఉన్న నగదు దొంగలు ఎత్తుకెళ్ళారు అక్కడ హుండీలోని నగదు తీసుకొని హుండీని అక్కడే వదిలి వెళ్ళిపోయారు. ఉదయం వచ్చిన ఆలయ పూజారి నాదెండ్ల రత్తయ్య అలయంలో హుండీ చోరి జరిగినట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.గత కొంత కాలంగా వరికుంటపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళం వేసిన ఇండ్లను, వృద్దులు ఒంటరిగా ఉన్న ఇండ్లను దొంగలు టార్టెట్ చేస్తున్నారు. ఇప్పటికైన పోలీసుల పహారా పెంచి రక్షణ కల్పించాలని స్థానిక తెదేపా నాయకుడు మాగంటి మాలకొండయ్య ( ఎం ఎం కె) పోలీసులను కోరుతున్నారు.

 

Tags: Cash theft in hundi in Abhayanjaneyaswamy temple

Post Midle