Natyam ad

ఆర్టీసీలో క్యాష్ లెస్ సర్వీసులు

విజయవాడ ముచ్చట్లు:


కరోనా తర్వాత నుంచి క్యాష్ పేమెంట్స్ తగ్గిపోయాయి. అన్ని ఆర్ధిక లావాదేవీలు ఎక్కువ శాతం ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీఎస్ఆర్టీసీ తన ప్రయాణీకులు గుడ్ న్యూస్ అందించింది. బస్సు ప్రయాణంలో క్యాష్, చిల్లర సమస్యలకు చెక్ పెడుతూ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు యూనిఫైడ్ టిక్కెటింగ్ సొల్యూషన్ పేరిట డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులో ఉంచింది. క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు ఫోన్‌పే, గూగల్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ ద్వారా బస్సు టికెట్‌కు డబ్బును చెల్లించే వెసులుబాటును కల్పించింది. ఇక ఈ డిజిటల్ చెల్లింపుల పట్ల ప్రయాణీకుల నుంచి అనుకూల స్పందన వస్తోందని ఆర్టీసీ యాజమాన్యం చెప్పింది.మొదటిగా ఈ డిజిటల్ చెల్లింపులను విశాఖపట్నం జిల్లాలో అమలు చేస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు. తొలుత విశాఖ నుంచి దూరప్రాంతాలకు నడిచే 97(డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ, అమరావతి) సర్వీసుల్లో ఈ సౌలభ్యాన్ని ప్రవేశపెట్టారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా నడిచే అన్ని బస్సుల్లోనూ, సిటీ బస్సుల్లో దశల వారీగా యూపీఐ పేమెంట్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల సదుపాయాన్ని అమలు చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ చెప్పింది.

 

 

టిమ్స్‌ స్థానంలో ఈ–పోస్‌ మిషన్లు:
ప్రస్తుతం బస్సుల్లో టికెట్లు ఇచ్చేందుకు టిమ్స్‌ను ఉపయోగిస్తున్నారు. వీటి స్థానంలో అధికారులు ఈ- పోస్ యంత్రాలను తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం జిల్లాకు 180 ఈ-పోస్ మిషన్లు వచ్చాయి. వీటి వినియోగంపై ఇప్పటికే డ్రైవర్లు, కండక్టర్లకు ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు. కాగా, ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్‌ చేసేవారు 10 శాతంగా ఉండగా.. ఆ సంఖ్య క్రమేపీ పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

Post Midle

Tags: Cashless services in RTC

Post Midle