27 నుంచి 3 వరకు కులగణన..

విజయవాడ ముచ్చట్లు:


ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎలక్షన్ ఫీవర్ నెలకొంటోంది. వైసీపీ సర్కార్ కు మరో నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉంది. అందుకే కీలక నిర్ణయాలు దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఏపీలో కుల గణన ప్రక్రియ ప్రారంభమైంది. దీనిని మరింత వేగవంతంగా పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కుల గణనకు సంబంధించి సచివాలయాలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి.రాష్ట్ర వ్యాప్తంగా కుల గణనను వారం రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్టు కింద వేర్వేరు చోట్ల కుల గణన చేపట్టారు. ఈనెల 27 నుంచి డిసెంబర్ 3 వరకు వారం రోజులపాటు ప్రతి ఇంటిని సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు జల్లెడ పట్టనున్నారు. మొత్తం 20 అంశాలకు సంబంధించి వివరాలు సేకరించనున్నారు. ఒకవేళ ఎవరైనా అందుబాటులో లేకపోతే.. గణన పూర్తయిన తర్వాత.. మరో వారం రోజులు పాటు ఇటువంటి వారి కోసం సమయాన్ని కేటాయించనున్నారు. అయితే నేరుగా ఆ కుటుంబ సభ్యుల సచివాలయాలకు వెళ్లి వివరాలు అందించాల్సి ఉంటుంది.ఈ కుల గణనకు సంబంధించి ప్రత్యేకమైన మొబైల్ యాప్ ను రూపొందించారు. వివరాలు సేకరించేటప్పుడు, ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్క్రీన్ షాట్ కానీ, వీడియో రికార్డింగ్ చేసేందుకు వీలు లేకుండా ప్రత్యేక యాప్ ను రూపొందించారు. సర్వేలో భాగంగా చిరునామా, కుటుంబసభ్యుల సంఖ్య, వివాహ వివరాలు, కులం,

 

 

 

ఉప కులం, మతం, రేషన్ కార్డు నెంబర్, విద్యార్హత, ఇంటి వివరాలు, వంట గ్యాస్ తో పాటుగా ఉపాధికి సంబంధించిన వివరాలు సేకరించనున్నారు.ఈ కులగణన ప్రక్రియతో రాజకీయ లబ్ధి చేకూరుతుందని వైసీపీ సర్కార్ ఆశిస్తోంది. ఇప్పటికే బీసీ కులాల జాబితా విషయంలో కొన్ని సామాజిక వర్గాలకు ఉపశమనం కలిగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కుల గణన ప్రక్రియ చేపడుతుండడం విశేషం. అయితే పూర్తిస్థాయి మ్యానువల్ విధానంలో చేయాల్సి ఉన్న గణన.. మొబైల్ యాప్ లో రూపొందిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. దీని ద్వారా సక్రమమైన సమాచారం అందుతుందా? లేదా? అన్న అనుమానాలు ఉన్నాయి. అదే సమయంలో వలంటీర్లకు భాగస్వామ్యం చేయడంతో పక్కదారి పడుతుందా? అన్న విమర్శలు వస్తున్నాయి. అయితే గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కుల గణనకు జగన్ సర్కార్ ముందుకు రావడం విశేషమే.

 

 

సక్సెస్ అయిన పైలెట్ ప్రాజెక్ట్
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కుల గణనను వారం రోజుల్లోనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 3లోగా సర్వే పూర్తి చేయాలని గ్రామ,వార్డు సచివాలయాలకు మార్గదర్శకాలు అందాయి. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో సర్వే నిర్వహించారు. ఇవి విజయవంతం కావడంతో ఈ నెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది.డిసెంబరు 3 నాటికి సర్వే పూర్తి చేయాని, సర్వేలో వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 20కి పైగా అంశాలపై సమాచారం సేకరించనున్నారు. సర్వే కోసం వాలంటీర్లు ఇళ్లకు వచ్చిన సమయంలో ఇంటికి తాళం వేసి ఉన్నా.. కుటుంబ సభ్యులు ఇళ్ల దగ్గర లేకపోయినా వారి వివరాల నమోదు కోసం సర్వే పూర్తయిన వివరాల నమోదుకు తరువాత మరో వారం గడువు ఇవ్వనున్నారు. ఆ సమయంలో సంబంధిత కుటుంబసభ్యులే సచివాలయాలకు వెళ్లి వివరాలు అందించాలి.కుల గణన సర్వే వివరాల నమోదుకు వాలంటీర్ల సెల్‌ఫోన్లలో ప్రత్యేక యాప్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు.

 

 

 

సర్వే ప్రారంభం నుంచి ముగింపు వరకు వాలంటీర్లు ఒకే ఫోన్ వినియోగించాల్సి ఉంటుంది. సర్వేలో భాగంగా కుటుంబాల నుంచి వివరాలు సేకరించేటప్పుడు, సర్వే పూర్తి అయిన తరువాత స్క్రీన్ షాట్ తీయకుండా యాప్‌లో డిజైన్ చేశారు.సమగ్ర కులగణన సర్వేలో భాగంగా ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తారు. వ్యక్తిగత చిరునామా, కుటుంబ సభ్యుల సంఖ్య, వివాహం జరిగిందా, లేదా, ‘కులం, ఉపకులం, మతం, రేషన్ కార్డు నంబరు, విద్యార్హత, ఇంటి రకం, నివాస స్థల విస్తీర్ణం, వ్యవసాయ భూమి విస్తీర్ణం, మరుగుదొడ్డి రకం, వంట గ్యాస్, తాగునీటి సదుపాయం ఉందా వంటి వివరాలను నమోదు చేస్తారు.ఇంట్లో ఉన్న పశువుల సంఖ్య తదితర వివ రాలను సేకరిస్తారు.ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటినే శాశ్వత చిరునామాగా పరిగణిస్తారు. కుటుంబంలో ఎవరైనా వ్యక్తి చనిపోతే అదే కుటుంబంలోని మరొకరు దాన్ని ధ్రువీకరిస్తూ వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.

 

 

త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కులగణనకు సిద్ధంగా ఉండాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అడిషనల్ డైరెక్టర్ ధ్యానచంద్ర అధికారులకు సూచించారు.ఇప్పటికే శ్రీకాకుళం, డా. అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైయస్ఆర్ జిల్లాల్లో ఎంపిక చేసిన సచివాలయాల్లో జరుగుతున్న ‘కులగణన ప్రయోగా త్మక సర్వే’ను సమీక్షించారు. ప్రాథమికంగా ఎదురైన సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చిం చారు. సర్వే కోసం రూపొందించిన యాప్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని సూచనలు చేశారు. ఈ-కేవైసీ నమోదులో ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారి గుర్తింపు కోసం ఫేషియల్, ఓటీపీ, వేలిముద్ర తదితర సౌకర్యాలు కల్పించారు.

 

Tags: Caste census from 27 to 3.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *