కులగణన దేశవ్యాప్తంగా చేయాలి

పుంగనూరు ముచ్చట్లు:

వెనుకబడిన ప్రజల అభ్యున్నతికి దేశవ్యాప్తంగా కులగణన ఎంతో అవసరమని ఎస్‌డిపీఐ పార్టీ నేతలు జమీర్‌, యూసుఫ్‌, అతిక్‌బాషాలు డిమాండ్‌ చేశారు. సోమవారం పట్టణంలో పార్టీ, వివిధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, తహశీల్ధార్‌ సీతారామన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అతిక్‌బాషా మాట్లాడుతూ కులగణనతో అణగారిన వర్గాలను గుర్తించడానికి వీలుందన్నారు. దేశవ్యాప్తంగా కులగణను చేపట్టాలని , లేకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిక్‌, మహబూబ్‌బాషా, షాముభారక్‌, యూసఫ్‌, ఏజియాస్‌, సోహేబ్‌, వశీం, ఖాదర్‌, సద్దాం, ముస్తఫా, సైపుల్లా, ఇర్ఫాన్‌, మాలిక్‌, తన్వీర్‌, నౌజవాన్‌కమిటి అధ్యక్షుడు అయూబ్‌, సభ్యులు పాల్గొన్నారు.

 

Tags: Caste census should be done all over the country

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *