పార్లమెంట్ సమావేశంలో బీసీల కుల గణన చేపట్టాలి

పెద్దపల్లి ముచ్చట్లు

పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్

బీసీ కుల గణన లేకుంటే బీసీల అస్తిత్వం కష్టమేనని, బీసీలకు ప్రస్తుతం అందుతున్న పలాలు కొనసాగాలంటే, జనాభా దామాష ప్రకారం బీసీల వాటా  దక్కాలంటే బీసీ లెక్కలు తప్పనిసరిగా ఉండాల్సిందేనని పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు.  పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నీ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పోస్టర్ ను జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ ఈ పార్లమెంట్ సమావేశంలో బీసీ కుల గణపైన పార్లమెంట్ లో చట్టం చేయాలన్నారు. జనాభాలో 55% ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో రిజర్వేషన్ కల్పించా లని, బీసీల పైన క్రిమిలేయార్ ఎత్తివేయా లని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ మాట్లాడుతూ కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తూ అగస్టు 7న తల్కటోర స్టేడియంలో అఖిల భారత జాతీయ ఓబిసి మహాసభ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆగస్టు 8న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నుండి పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం 29 రాష్ట్రాల నుండి వస్తున్న వేలాది మంది బీసీ కార్యకర్తలతో చేపట్టనట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా నుండి పెద్ద ఎత్తున బీసీ నాయకు లు, బీసీ యువకులు, బీసీ మహిళలు, బీసీ విద్యార్థులు ఈ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రామగిరి మండల ఎంపిపి దేవక్క కొమురయ్య, జడ్పిటిసి శారదా కుమార్, బీసీ సంఘం మండల అధ్యక్షులు నవీన్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధిగా  కంకటి శ్రీనివాస్,  కలవేన రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:Caste enumeration of BCs should be taken up in the session of Parliament

Leave A Reply

Your email address will not be published.