క్యాట్ ఫిష్ చెరువులు ధ్వంసం

ఒంగోలు ముచ్చట్లు :

ప్రకాశం జిల్లా చీమకుర్తి  మండలం  ఓబచెత్తవారి పాలెం లో కోళ్ల వ్యర్ధాలతో షుమారు 50 ఎకరాలలో క్యాట్ ఫిష్ లను పెంచుతున్న చెరువులను మత్స్యశాఖ అధికారులు ధ్వంసం చేసారు.  వివరాల్లోకి వెళితే జిల్లాలోని చీమకుర్తి మండలం ఓబచెత్తవారిపాలెం గ్రామ పరిసరాలలో కోళ్ల వ్యర్ధాలతో షుమారు 50 ఎకరాలలో క్యాట్ ఫిష్ లను పెంచేందుకు చెరువులను తయారుచేసి తమ గ్రామ పరిసరాలు కలుషితం చేస్తున్నారన్న ఓబచెత్తవారిపాలెం గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ప్రకాశంజిల్లా మత్యశాఖ అధికారులు పలు జేసీబీలతో ధ్వంసం చేసారు. ఈ క్యాట్ ఫిష్ ల పెంపకం నేరమని, అలా చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Catfish ponds destroyed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *