జాగ్రత్త … జనం కదలికలపై కెమెరాల కన్ను

Beware ... Cameras eye on people moving

Beware ... Cameras eye on people moving

– పోలీసులకు దొరకని సమాచారం

Date:07/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

ఇక మీదట పట్టణాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలి…. పట్టణాల్లో నివశించి ప్రజలతో పాటు సంచరించే ప్రతి ఒక్కరు హద్దులు దాటితే కెమెరాలో చిక్కుకుంటారు….. కెమెరాల్లో రికార్డు కాబడిన మేరకు కేసుల్లో ఇరుక్కుంటారు….జాగ్రత్త…శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న అనుమానంతో ముందుజాగ్రత్తగా జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాలలో కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా రహదారులు, కూడలి ప్రాంతాలతో పాటు ముఖ్యమైన ప్రదేశాలలో కెమెరాలు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

ఒకొక్క పట్టణంలో జనాభాను బట్టి 25 నుంచి 50 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెలాఖరులోపు చిత్తూరు జిల్లాలో కెమెరాలు పూర్తి స్థాయిలో పని చేయనున్నాయి. దీని ద్వారా అసాంఘిక శక్తుల సంచారాన్ని గుర్తించి, సంఘ విద్రోహ శక్తుల భరతం పట్టేస్తారు…

ఈ కెమెరాలను పుంగనూరులో ఏర్పాటు చేశారు. పట్టణంలోని బస్డాండు, ఇందిరాసర్కిల్‌, తూర్పువెహోగశాల, ఎంబిటి రోడ్డు, ఎన్‌ఎస్‌.పేట, కొత్తపేట, సెంటర్‌లాడ్జి లాంటి ప్రధాన కూడలి ప్రాంతాలతో పాటు 25 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి 90 డిగ్రీల కోణంలో వెనుక , ముందు కదలికలను సైతం పసిగట్టే పెద్ద హెచ్‌డి కెమెరాలను అమర్చారు.

ఈ కెమెరాలకు సుమారు ఇరవై అడుగుల ఎత్తు గల ఇనుప స్తంభాలను ఏర్పాటు చేసి, బిగించారు. దాని క్రింది భాగమున ఇంటర్‌నెట్‌ బాక్సును ఏర్పాటు చేసి, పట్టణంలోని అన్ని కెమెరాలకు అనుసందానం చేశారు. పట్టణంలోని ఏదైనా కెమెరా మరమ్మతలకు గురైనా రాజధానికి సమాచారం అందేలా ఏర్పాట్లు చేశారు.

నిరంతరం వైర్లెస్‌ ఇంటర్‌నెట్‌తో ప్రజలతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను ఈ కెమెరా బందించి స్థానిక పోలీసులకు, జిల్లా పోలీసులకు సైతం ఈ కెమెరాలలో నిక్షిప్తమైన సమాచారం అందదు. కేవలం అమరావతిలోని డీజీపి కార్యాలయానికి మాత్రమే సమాచారం అందుతుంది. ఈ మేరకు అనుసందానం చేశారు. కాగా ఈ కెమెరాలు స్థానిక పోలీసులకు కూడ తెలియకుండ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో అర్థంకాక పోలీసులు తలపట్టుకుంటున్నారు.

Beware ... Cameras eye on people moving

ఉత్తమ సేవలందించిన ఈవో ఏకాంబరం

Tags:Caution … Cameras eye on people moving

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *