అపంతృప్తిలో కావేటి సమ్మయ్య 

Cavitai in the inferiority

Cavitai in the inferiority

 Date:11/10/2018
అసిఫాబాద్  ముచ్చట్లు:
అధికార తెరాస లో రోజు రోజు కు అసంతృప్తుల సంఖ్య పెరుగుతున్నది టికెట్ దక్కని నేతలు రోడ్డెక్కుతున్నారు అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ నియోజకవర్గ ము నుండి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ  ఎమ్మెల్యే  కావేటి సమ్మయ్య పార్టీ పై ఫైర్ అయ్యారు  కాగజ్ నగర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు పార్టీలో తీవ్ర   అన్యాయం జరిగిందని ఆవేదన చెందారు ఆంధ్రా వలస నాయకులకు టిఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చి తనకు అన్యాయం చేసారు.. అన్నారు.  తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినాం. దెబ్బలు తిన్నాము, తెలంగాణ కోసం రాజీనామా చేసాను, ఉద్యమ పోరాటంలో ప్రాణాలకు తెగించి పోరాడనాను.
అసెంబ్లీ పై ఎక్కి ప్రశ్నించాను, తెలంగాణ కోసం వందల కేసులు నా మీద పెట్టారు, ఒక్కడు కూడ టిఆర్ఎస్ జెండా మొయ్యలేదు, కేసిఆర్ ను అవమానం పర్చినోళ్ళకు ఇప్పుడు టిక్కెట్ ఇచ్చారు, రెండు సార్లు గెలిచిన నాకు ఈరోజు గుర్తింపు లేదని అవేదన వ్యక్తం చేసారు. తెరాస నాకు రెండు కళ్ళు, ఇప్పటి వరకు పార్టీ కోసం తప్పుగా మాడ్లలేదు. ఐదేళ్ళుగా కేసిఆర్ చుట్డు తిరుగుతున్నాను, ఇప్పటికైన వాళ్ళకు బి ఫాం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలి, బీసి సామాజిక వర్గానికి చెందిన నాకు అన్యాయం జరుగుతుంది. అగ్రవర్ణాలు సిర్పూరు లో రాజ్యమేలుతున్నారు. ఉద్యమం కోసం నా ఐదేళ్ల ఎమ్మెల్యే కాలం గడిపాను. .ఉద్యమం కారుడైన నన్ను చులకగా చేసి చూస్తున్నారు .ఒక్కప్పుడు జెండా ఎవరుపట్టలేదు.  టిఆర్ఎస్ పార్టీ ని ముందుండి నడిపించాను .ఇఒప్పటి కైన బిసి నై న నన్ను గుర్తించి టిక్కెట్ ఇవ్వాలని అయన కేసీఆర్ ను కోరారు.
Tags:Cavitai in the inferiority

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *