6 నెలల విరామం తర్వాత కడపకు చేరుకున్న సీబీఐ అధికారి రామ్ సింగ్

-వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న రామ్ సింగ్

-రామ్ సింగ్ తనను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఫిర్యాదు చేసిన ఉదయ్ కుమార్ రెడ్డి

-ఉదయ్ ఫిర్యాదు ఆధారంగా రామ్ సింగ్ పై పోలీసు కేసు

-6 నెలల క్రితం కడపను వదిలి వెళ్లిన రామ్ సింగ్

-శుక్రవారం పలువురు నిందితులను ప్రశ్నించనున్న రామ్ సింగ్

 

కడప ముచ్చట్లు:

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందానికి నేతృత్వం వహిస్తున్న రామ్ సింగ్ 6 నెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి కడపలో అడుగుపెట్టారు. శుక్రవారం ఆయన కడప చేరుకున్నారు. కడపలోని సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ ను కార్యాలయంగా మార్చుకున్న సీబీఐ అధికారులు వివేకా కేసును దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.వివేకా హత్య కేసులో తాను చెప్పినట్లుగా వాంగ్మూలం ఇవ్వాలంటూ రామ్ సింగ్ తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారంటూ ఈ కేసులోని నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే.ఉదయ్ ఫిర్యాదు మేరకు రామ్ సింగ్ పై స్థానిక పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అదే సమయంలో హైకోర్టులోనూ ఈ వ్యవహారంపై విచారణ సాగగా..నిందితులపై బలవంతపు వాంగ్మూలాలు సరికాదని కోర్టు సీబీఐకి సూచించింది. ఈ నేపథ్యంలో 6 నెలల క్రితం రామ్ సింగ్ కడపను వదిలి వెళ్లారు.శుక్రవారం ఈ కేసులో పలువురు అనుమానితులను రామ్ సింగ్ విచారించనున్నట్లు సమాచారం.

 

Tags: CBI officer Ram Singh reached Kadapa after a gap of 6 months

Leave A Reply

Your email address will not be published.