వివేకా కేసులో సీబీఐ పిటీష‌న్

Date:16/09/2020

క‌డ‌ప‌ ముచ్చట్లు

సీఎం జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. గత నెలలో ఒక దఫా విచారణ చేసిన సీబీఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి కీలక ఫైళ్ళతో సహా ఢిల్లీకి వెళ్లారు. హత్య జరిగిన అనంతరం పరిస్థితులపై సాక్ష్యులను విచారించిన సీబీఐ బృందాలు వివేకా కుమార్తె వద్ద నుండి కీలక సమాచారాన్ని అందుకొని పలు కోణాల్లో విచారణ చేపట్టారు. కాగా సీబీఐ అధికారులు గత వారం ఈ కేసులో మరో దఫా విచారణ ప్రారంభించగా ఈసారి మాత్రం సీబీఐ గుంభనంగా వ్యవహరిస్తోంది.ఈక్రమంలోనే సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వారంలోనే ఈ పిటిషన్‌ పై కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉండగా ఇప్పుడు అసలు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ ఏమిటన్నదానిపైనే రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఈ పిటిషన్ లో సీబీఐ అధికారులు ఎవరైనా ప్రముఖులను విచారించేందుకు కోర్టు అనుమతి కోరిందా? లేక ఏమైనా కీలక సమాచారం అప్పగించాలని కోర్టుకు వెళ్ళారా? అన్న చర్చ మొదలైంది.ఈ కేసులో ఇప్పటికే చాలా మంది ప్రముఖుల పేర్లు వినిపించాయి.

 

 

 

అందులో కొందరిని తొలి దఫాలోనే సీబీఐ అధికారులు విచారణ జరపగా ఈ దశ దర్యాప్తులో మరికొందరు కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. తొలుత సీబీఐ బృందాలకు తోడు లోకల్ పోలీసుల సహాయంతో విచారణ ప్రారంభించిన అధికారులు మెల్లగా విచారణ ముమ్మరం అయ్యేకొద్దీ లోకల్ పోలీసులను తప్పించి ఢిల్లీ నుండి అధికారులను పిలిపించుకున్నారు. రెండో దశ విచారణ ప్రారంభం నుండే సీబీఐ గుంభనంగా ముందుకెళ్తుంది.ఈ కేసులో వివేకా కుమార్తె పట్టుదలగా ఉంది. ఏపీ ప్రభుత్వం స్వరాష్ట్ర బృందాలతోనే విచారణ జరుపుతుండగా వివేకా కుమార్తె పట్టుబట్టి హైకోర్టుకెళ్ళి సీబీఐ దర్యాప్తు సాధించారు. కేసులో కీలక ఆధారాలను సైతం వివేకా కుమార్తె సీబీఐ అధికారుల ముందు పెట్టినట్లుగా నిర్ధారనైంది. కొద్దిరోజులుగా సీబీఐ అధికారులు కడప సెంట్రల్ జైలు కేంద్రంగా ఈ విచారణ ప్రారంభించగా రెండో దశ విచారణలో ఇప్పటికే ఎలాంటి లీకులు లేకుండా జాగ్రత్త వహిస్తున్నారు. మరి పులివెందుల కోర్టులో పిటిషన్ దేని కోసం? ఏ అనుమతి కోసమన్నది విచారణ మొదలైతే కానీ తెలిసే అవకాశం లేదు!

బీజేపీకే జై అంటున్నారు 

Tags: CBI petition in Viveka case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *