పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మృతిఫై సీబీఐ విచారణ!

CBI probe into Pandit Deendayal teacher's death
Date:22/09/2018
లక్నో ముచ్చట్లు:
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మృతిచెందిన 50 ఏళ్ల తర్వాత యూపీలోని యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఆయన అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని బావిస్తుంది.1968 సెప్టెంబర్ 25న ముఘల్సరాయ్ స్టేషన్ వద్ద రైలు పట్టాలపై దీన్ దయాళ్ అనుమానాస్పదరీతిలో చనిపోయి కనిపించారు.
ఆయన ప్రమాదంలో చనిపోయారా లేక హత్యకు గురయ్యారా అన్నదానిపై ఇప్పటి వరకు నిజానిజాలు బయటికి రాలేదు.పండిట్ దీన్‌దయాళ్ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ అంబేద్కర్ నగర్‌కి చెందిన బీజేపీ కార్యకర్త రాకేశ్ గుప్తా ఏడాది క్రితమే కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్టు సమాచారం.
ఆయన మరణం వెనుక పెద్ద కుట్ర, దాగి ఉందని ఆయన తన లేఖలో ఆరోపించినట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై యూపీ ప్రభుత్వం నుంచి కేంద్ర నివేదిక కోరడంతో.. దీనిపై దర్యాప్తు చేయాలంటూ అలహాబాద్ రైల్వే ఎస్పీని ఆదేశించారు.
అయితే పండిట్ దీన్‌దయాళ్ మృతిపై ఎఫ్ఐఆర్ రిపోర్టు, కేసు డైరీ సహా అన్ని ఆధారాలు మాయమయ్యాయంటూ ఎస్పీ ఇటీవల నివేదించారు.
కాగా పోలీస్ స్టేషన్ రిపోర్టులో మాత్రం ఈ కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారనీ.. ఓ వ్యక్తిని దోషిగా గుర్తించి నాలుగేళ్లు జైలు శిక్ష విధించారని ఉంది.1968 ఫిబ్రవరి 11న ఈ సంఘటన చోటుచేసుకుంది.
గుర్తు తెలియని వ్యక్తులపై 67/1968 నంబరుతో కేసు నమోదు చేశారు. 1969లో భరత్ రామ్ అనే వ్యక్తి ఐపీసీ సెక్షన్ 379/411 కింద దోషిగా తేలగా… మిగతా ఇద్దరు నిర్దోషులుగా విడుదలయ్యారఅంటూ రైల్వే ఎస్పీ ఐజీకి నివేదించారు.
Tags:CBI probe into Pandit Deendayal teacher’s death