వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు  ముమ్మరం

Date:18/09/2020

కడప ముచ్చట్లు:

మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు తమకు ఇవ్వాలని కోరుతూ పులివెందులలోని జూనియర్‌ సివిల్‌ కోర్టులో సీబీఐ అధికారులు వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి గురువారం పరిశీలించారు. దానిని నేర విభాగానికి పంపించారు.. ఆ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరపనున్నట్లు న్యాయవాదులు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు సీబీఐ అధికారులు కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీకాంత్‌ను ఒక ప్రత్యేక గదిలో వారు కలిసి సుమారు అరగంటపాటు చర్చించారు. అనంతరం సీబీఐ అధికారులు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌తో కలిసి ప్రత్యేక వాహనంలో బయలుదేరి వెళ్లారు. ఈ నెల 13న ఇద్దరు సీబీఐ అధికారులు పులివెందులకు రాగా.. ప్రస్తుతం మరో ఇద్దరు వచ్చారు.2019 మార్చి 14వ తేదీన వివేకానందరెడ్డి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్యకు గురైన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కేసుకు సంబంధించిన విచారణకు సిట్‌ను నియమించారు.

 

 

అయితే నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడిచినా వివేకా కేసు విచారణ చేపట్టిన సిట్‌ దర్యాప్తులో మాత్రం పురోగతి లేదని, పలు అనుమానాలు ఉన్నాయనంటూ వివేకా కుమార్తె సునీత సీబీఐకి అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించారు. సిట్‌ విచారణపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అమాయకులను ఇరికించి తన తండ్రి హత్య కేసులో అసలైన నేరస్తులను వదిలేస్తారేమో? అని సందేహం కలుగుతోందని హైకోర్టులో వాదన వినిపించారు. దీంతో హైకోర్టు ఈ కేసును హైకోర్టుకు అప్పగిస్తూ సంచలన ప్రకటన చేసింది. దీంతో వివేకా హత్యను ఛేదించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది.

 

ఎంపీలకు నాని స్ట్రాంగ్ ట్వీట్

Tags:CBI probe into Vivekananda Reddy murder case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *