మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావుకు సీబీఐ గట్టి షాక్

Date:09/01/2020

విజయవాడ  ముచ్చట్లు:

వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి  ధర్మాన ప్రసాద్ రావుకు సీబీఐ గట్టి షాక్ ఇచ్చింది. వైఎస్ హయాంలో కీలక మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ధర్మానపై కూడా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇందులోని వాన్ పిక్ కేసులో అప్పటి మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాద్ రావుపై విచారణ చేపట్టడానికి సీబీఐ రెడీ అయ్యింది. ధర్మానపై అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న ఆరోపణలపై విచారణ  చేపట్టవచ్చని సీబీఐ తాజాగా పేర్కొంది. ఈ మేరకు ధర్మానను విచారణ చేయవచ్చు అంటూ కోర్టుకు సీబీఐ తెలిపింది.జగన్ ఆస్తుల కేసు ధర్మాన  ప్రసాదరావు కు సంబంధించి సుప్రీం కోర్టు పిటీషన్ దాఖలైంది. ఈ కేసు విచారణ ఎంత వరకు వచ్చిందని హైదరాబాద్ సీబీఐ  కోర్టు  జడ్జి  సీబీఐని ప్రశ్నించారు. వివరాలు అందించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో పిటీషన్ ఉన్నా అవినీతి నిరోధక చట్టం కింద ధర్మాన ప్రసాద్ రావును విచారణ చేపట్టవచ్చని సీబీఐ తాజాగా పేర్కొని ఆయనకు షాక్ ఇచ్చింది.ఇన్నాళ్లు ఈ కేసు స్తబ్దుగా ఉందని ధర్మాన సహా అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ ధర్మాన పై విచారణ చేపట్టవచ్చని సీబీఐ పేర్కొనడం ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశమైంది.

రాజధాని పై కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్ట్ !

 

Tags: CBI shocked former minister Dharmana Prasad Rao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *