సీబీఐ అధికారుల అవినీతిపై విచారణ సిగ్గుచేటు

CBI's culprits are convicted of corruption

CBI's culprits are convicted of corruption

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
Date:23/10/2018
విజయవాడ ముచ్చట్లు:
దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ కార్యాలయంలోనే అధికారుల అవినీతిపై విచారణ జరుగుతుండటం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. విజయవాడ దాసరి భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీబీఐని దిగజార్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాఫెల్‌ కుంభకోణం, సీబీఐ అవినీతి, ఇతర అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామన్నారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ దిల్లీలో గంటసేపు సమావేశం పెడితే అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్య పరిష్కారం అవుతుందని.. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలంటూ భాజపా ధర్నాలు రాజకీయ డ్రామాలని ఆయన ఆరోపించారు.
Tags:CBI’s culprits are convicted of corruption

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *