20న సీబీఎస్ఈ ఫలితాలు

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

 

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. టెన్త్‌ క్లాస్‌ ఫలితాల వెల్లడికి సీబీఎస్‌ఈ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా స్కూళ్ల నుంచి ఫలితాలను తెప్పించుకున్న సీబీఎస్‌ఈ బోర్డు జూలై 20న ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.ఎప్పటిలాగే ఇంటర్నల్స్‌కు 20 మార్కులు కేటాయించగా.. మిగతా 80 శాతం మార్కులను యూనిట్‌ టెస్టులకు- 10, అర్ధ సంవత్సరం పరీక్షలకు-30, ప్రీ బోర్డు పరీక్షలకు- 40 మార్కుల చొప్పున కేటాయించి దానికి అనుగుణంగా ఫలితాలు ప్రకటించనుంది.ఇక ఎవరైనా విద్యార్థులకు పాస్‌ మార్కులు రాకపోతే గ్రేస్‌ మార్కులు ఇవ్వాలని ఆయా స్కూళ్లకు సీబీఎస్‌ఈ బోర్డు సూచించింది. అప్పటికీ విద్యార్థులు పాస్‌ మార్కులు పొందకపోతే.. వారిని ఎపెన్షియల్‌ రిపీట్‌ కంపార్ట్‌మెంట్‌ కేటగిరిలో ఉంచుతారు. ఒక వేళ విద్యార్థులు ఎవరైనా ఫలితాల పట్ల సంత`ప్తి చెందకపోతే కరోనా పరిస్థితులు చక్కబడ్డాక నిర్వహించే పరీక్షలకు హాజరుకావచ్చని ఇప్పటికే సీబీఎస్‌ఈ బోర్డు ప్రకటించింది.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:CBSE results on the 20th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *