నేరాల అదుపునకు  సిసి కెమెరాలు ఎంతో దోహదపడతాయి

-సిసి కెమెరాల ఏర్పాటుకు కాలనీ వాసులు ముందుకు రావాలి.

Date:02/12/2019

నేరెడీమేట్ ముచ్చట్లు:

నేటి సమాజములో నేరాల అదునకు సిసి కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యత ఎంతో ఉందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు.సోమవారం వినాయక నగర్ డివిజన్ పరిధిలో ని శ్రీ సాయి నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో  కాలనీ లో  ఏర్పాటు చేసిన 16 సిసి కెమెరాలను మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిధిగా విచ్చేసి స్థానిక నేరెడీమేట్ సి ఐ నరసింహ స్వామితో కలసి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నగరంలో దోపిడీలు, దొంగతనాలు,రెపులు, హత్యాచారాలు,హత్యల నివారణ కు ప్రతి ఒక్కరు తమ తమ ఇంటి ముందు రోడ్డు వైపు సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకొని పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.మల్కాజ్ గిరి  నియోజక వర్గంలో ప్రజల సంక్షేమానికి తాను అహర్నిశలు కృషి చేస్తా నాని పేర్కొన్నారు.ఈ కార్యక్రమములో టి అర్ ఎస్ నాయకులు రంపే చంద్ర మౌళి,మడి పడిగే జగదీష్ గౌడ్,ఇస్తారి,ఉపేందర్, వెంకన్న గౌడ్, వెంకటేష్ చారి, ఆంజనేయులు,కృష్ణా, నరసింహ,మల్లేష్,సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి ఆశిస్తున్న సేవలు అందిస్తాం.

Tags: CC cameras can greatly contribute to crime prevention

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *