Natyam ad

ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు

రామసముద్రం ముచ్చట్లు:

మండలంలోని మారు మూల గ్రామాలకే కాకుండా ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు వేయనున్నట్లు వైస్ ఎంపీపీ రమణారెడ్డి, సింగిల్ విండో చెర్మెన్ కేశవరెడ్డి, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ భాస్కర్ గౌడులు తెలిపారు. సోమవారం చొక్కాండ్లపల్లి పంచాయతీ పురాండ్లపల్లి ఎస్సి కాలనీలో సర్పంచ్ రుక్మిణమ్మ, ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ అధ్యక్షతన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషా చొరవతో ఎంపీ గ్రాంటు రూ. 10లక్షలు, ఎంపీటీసీ గ్రాంటు రూ. 5లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ఈ నిధులతో సుమారు 450మీటర్లు దూరం రోడ్డు వేయడం జరుగుతుందన్నారు.గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేదిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మరమ్మతులకు గురైన గ్రామాల్లో సైతం నూతనంగా సీసీ రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చెంగారెడ్డి, నాయకులు గెవన్న, కృష్ణారెడ్డి, రెడ్డిశేఖర్ తదితరులు పాల్గొన్నారు .

 

Post Midle

Tags: CC roads to every village

Post Midle

Leave A Reply

Your email address will not be published.