– సుప్రీం సంచలన ఆదేశాలు
Date:03/12/2020
హైదరాబాద్ ముచ్చట్లు:
దేశ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన కార్యాలయాల్లో సీసీటీవీ కెమేరాలు అమర్చాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ సహా అన్ని దర్యాప్తు సంస్థల్లోనూ విధిగా సీసీటీవీలు అమర్చాలని సూచించింది. ఈ సీసీటీవీ కెమేరాలన్నిటిలోనూ తప్పనిసరిగా నైట్ విజన్, ఆడియో రికార్డింగ్ ఉండాలని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను యధాతథంగా సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని సూచించింది. పరమ్‌వీర్ సింగ్ సైని అనే వ్యక్తి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) మేరకు సర్వోన్నత ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
Tags: CCTVs are mandatory in police stations