Cease for sale of drugs worth Rs 8 lakhs

రూ.8 లక్షల మందులు విక్రయాలు నిలిపివేత

– రూ.70 వేలు విలువ చేసే విత్తనాలు
– ఏవో సంధ్య

Date:02/07/2020

పుంగ నూరు ముచ్చట్లు:

పట్టణంలోని మూడు ఎరువులు , క్రిమిసంహారక మందులు షాపుల్లో తనిఖీ చేసి రూ. 8 లక్షలు విలువ చేసే క్రిమి సంహారక మందులను , రూ.70 వేలు విలువ చేసే విత్తనాల విక్రయాలను నిలుపుదల చేసినట్లు ఏవో సంధ్య తెలిపారు. గురువారం ఏడిఏలు రమేష్‌, లక్ష్మానాయక్‌ ఆధ్వర్యంలో షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. రైతుమిత్ర, కిసాన్‌ట్రేడర్స్, హర్ష ట్రేడర్స్ వారు విక్రయాలకు అనుమతులు పొందకపోవడంతో అవకతవకలు బయటపడి విక్రయాలను నిలిపివేసినట్లు ఆమె తెలిపారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు ప్రభుత్వ ధరలకు విక్రయించాలని, ప్రతి వస్తువుకు బిల్లులు చెల్లించాలని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Tags: Cease for sale of drugs worth Rs 8 lakhs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *