పుంగనూరులో 9న ఆదివాసి దినోత్సవం-జయప్రదం చేయండి

పుంగనూరు ముచ్చట్లు:

అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని మంగళవారం స్థానిక అంబేద్కర్‌ భవన్‌కు అందరు హాజరై జయప్రదం చేయాలని ఎరుకుల సంక్షేమ సంఘ నాయకులు ఎం.రామకృష్ణ, కోరారు. సోమవారం ఈ మేరకు కరపత్రాలను విడుదల చేశారు. ఎం.రామకృష్ణ మాట్లాడుతూ ఆదివాసి దినోత్సవ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డెప్ప, రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు శ్రీనివాసులు, ఎం.బాబు, వై రామకృష్ణ, కృష్ణప్ప, రామాంజులు, వై.శ్రీనివాసులు, ఆదెప్ప, రమణ, మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Celebrate Adivasi Day-Jayapradam on 9th in Punganur

Leave A Reply

Your email address will not be published.