Natyam ad

పుంగనూరులో ఆజాదీకా అమృత్‌ ఉత్సవాలను జయప్రదం చేయండి- కొండవీటి నాగభూషణం

పుంగనూరు ముచ్చట్లు:

ఆజాదీకా అమృత్‌ 75 ఉత్సవాలలో ప్రతి ఒక్కరు పాల్గొని , జెండాను కట్టి జాతీయగీతం ఆలాపించాలని రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం పిలుపునిచ్చారు. శనివారం మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ,ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డిలకు పట్టణ జనగణమన కమిటి సభ్యులు జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. నాగభూషణం మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల ఆధ్వర్యంలో 2018 ఆగస్టు 15 నుంచి నిత్యజాతీయగీతాలాపన పట్టణంలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటిచెప్పాలని కోరారు. హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమం జయప్రదం చేసేందుకు ప్రతి ఇంటికి వలంటీర్ల ద్వారా జెండాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే పట్టణంలోని అన్ని ప్రాంతాలలోను మైకులు ఏర్పాటు చేసి, గీతాలాపన చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు ప్రకాష్‌, అయూబ్‌ఖాన్‌, దీపక్‌, బాబు, రెడ్డిప్రసాద్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు రాజేష్‌, సురేష్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Celebrate Azadika Amrit Utsavam in Punganur – Kondaveeti Nagabhushanam

Post Midle

Leave A Reply

Your email address will not be published.