Date:24/11/2020
దర్శి ముచ్చట్లు:
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్నీ ఆమోదించి నవంబర్ 26వ తేదీకి 71వ సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవాలు ఘనంగా ఎంపీడీవో ఆఫీస్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర దళిత సేన ప్రధాన కార్యదర్శి గర్నెపూడి ప్రేమ్ కుమార్ తెలియజేశారు.నవంబర్ 26 రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమానికి దర్శి డిఎస్పి కె ప్రకాశ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తారని తెలియజేశారు. మంగళవారం కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, టైం స్కేల్ ఎంప్లాయిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు,ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగుల రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు మిటనాల బ్రహ్మయ్య, పోతవరం పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస రావు , దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు కె మార్క్, జి.వెంకటస్వామి, కోటేశ్వరరావు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Tags:Celebrate Constitution Day