Natyam ad

పుంగనూరులో 10న మంత్రి పెద్దిరెడ్డి పర్యటనను జయప్రదం చేయండి

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం పట్టణంలో పర్యటిస్తారని, ఆయన పర్యటనను జయప్రదం చేయాలని రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం కోరారు. మంగళవారం మున్సిపాలిటిలో చైర్మన్‌ అలీమ్‌బాషా, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహస్‌తో కలసి పార్టీ నాయకులు, గృహసారధులు, వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. నాగభూషణం మాట్లాడుతూ గృహసారధులతో, పార్టీ నాయకులతో మంత్రి పెద్దిరెడ్డి చర్చాగోష్టి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి తెలిసేలా గృహసారధులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు సిఆర్‌.లలిత, నాగేంద్ర, వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Celebrate Minister Peddireddy’s visit to Punganur on 10th