పుంగనూరులో 8న మంత్రి పెద్దిరెడ్డి పర్యటనను జయప్రదం చేయండి

పుంగనూరు ముచ్చట్లు:

 

 

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనను జయప్రదం చేయాలని నేతలు కోరారు. బుధవారం మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా సుగాలిమిట్టలో నిర్మించిన ఆర్‌బికె కేంద్రాన్ని , రక్తదాన శిభిరాన్ని మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. కమిషనర్‌ కెఎల్‌.వర్మ మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి పట్టణంలోని రాజన్న విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, వైద్యశిభిరాన్ని ప్రారంభిస్తారన్నారు. అలాగే అంబేద్కర్‌ సర్కిల్‌లో నూతనంగా నిర్మించనున్న క్లాక్‌టవర్‌ పనులకు శంఖుస్థాపన చేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపిపి నరసింహులు, పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌, సర్పంచ్‌ శంకరప్ప, పార్టీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డి, చెంగారెడ్డి, అగిస్తిరెడ్డి, విజయకుమార్‌ పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags; Celebrate Minister Peddireddy’s visit to Punganur on the 8th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *