Natyam ad

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జయప్రదం చేయండి

నంద్యాల ముచ్చట్లు:


నంద్యాల పద్మావతి నగర్  శ్రీకృష్ణ మందిరం నందు యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకొనుటకు యాదవ సంఘం కమిటీ సభ్యులు నిర్ణయించినారు. కావున 18.8.22  సాయంత్రం  కబడ్డీ పోటీలు ప్రారంభమగును. అదే రోజు రాత్రి 12 గంటలకు అనగా 19.8.22 ఉదయం శ్రీకృష్ణ జన్మాష్టమి పూజా కార్యక్రమం జరుగును. అలాగే ఉదయం 8 గంటలకు గోపూజ, ఆ తర్వాత అల్పాహారము, 8:30 కి జెండా వందనము, 9 గంటలకు ప్రార్ధన, 9:30కు వెన్న ముద్ద వేలము, 10 గంటలకు ఉట్టి ఉత్సవము, 10:30 కి గ్రామోత్సవము, 12 గంటల 30 నిమిషాలకు అన్నదాన కార్యక్రమం జరుగును, సాయంత్రం 6 గంటలకు సాంస్కృతి కార్యక్రమంలో వివిధ పాఠశాల నుండి వచ్చిన విద్యార్థిని విద్యార్థులచే శ్రీకృష్ణునికి సంబంధించిన నృత్య పోటీలు, అలాగే బహుమతులు ప్రదానము చేయబడును. ఈ వేడుకలకు నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మరియు యాదవ సంఘం సోదర సోదరీమణులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గోర్ల సత్యనారాయణ యాదవ్  పార్థసారధి యాదవ్ నాలి విజయ శేఖర్ యాదవ్ రోటరీ సుబ్బయ్య యాదవ్ బోధనం చంద్రశేఖర్ యాదవ్ విజయ గౌరీ యాదవ్ బీసీ సంఘ నంద్యాల జిల్లా అధ్యక్షులు శేషు యాదవ్, పృధ్వి యాదవ్, గోపాల్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, పిరయ్య యాదవ్, చంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Celebrate Sri Krishna Janmashtami celebrations

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.